చిన్నారుల్లో స్నేహభావం పెంపుదలకు కృషి

వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ (విసిసి)

పలుచోట్ల విసిసి జోనల్‌ కమిటీ మహాసభలు

ప్రజాశక్తి- తగరపువలస : పిల్లల మధ్య స్నేహభావం పెంపుదలకు వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ (విసిసి) నిరంతరం కృషి చేస్తున్నట్లు క్లబ్‌ జిల్లా జాయింట్‌ సెక్రటరీ డి శైలజ అన్నారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం క్లబ్‌ భీమిలి జోన్‌ మహాసభ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను పెంచడం, సంస్కతి, కళలు నేర్పించడం, క్రీడలను ప్రోత్సహించడం , ప్రకృతి పట్ల ఆసక్తి, పర్యావరణంపై అవగాహన పెంపొందించడం ద్వారా పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడం, విసిసి లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం విసిసి భీమిలి జోన్‌ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. కన్వీనర్‌గా తేజ, కో కన్వీనర్లుగా కె నాగరాణి, ఎస్‌ గుణమ్మ పెద్దల నుంచి ఎన్నికవ్వగా, శిరీష, పుష్ప, దుర్గ పిల్లల నుంచి ఎన్నికయ్యారు.పిల్లల నుంచి ప్రెసిడెంట్‌గా ఝాన్సీ, సెక్రటరీగా సౌమ్య, ఉపాధ్యక్షులుగా శశాంక్‌, జాయింట్‌ సెక్రటరీగా చాందినిఎన్నికయ్యారు.

ములగాడ : జివిఎంసి 62వ వార్డు త్రినాధపురం విసిసిజోన్‌ మహాసభ కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించారు. దేశభక్తి గీతాలాపనతో ప్రారంభమైన మహాసభలో మల్కాపురం జోన్‌ కన్వీనర్‌ ఇ.అరుణ నివేదిక ప్రవేశపెట్టారు మహాసభలో ప్రజానాట్యమండలి జోన్‌ కార్యదర్శి పి. లెనిన్‌బాబు డివైఎఫ్‌ఐ నాయకులు బి.ప్రసాద్‌, ఎ.ప్రశాంత్‌ యు.రాజు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీలో జోన్‌ కన్వీనర్‌గా ఇ.అరుణ కో కన్వీనర్‌గా పి.పద్మ విసిసి కమిటీ అధ్యక్షులుగా వై కల్యాణి, కార్యదర్శిగా పి. నిఖిల, సభ్యులుగా చిన్మయి, చాతుర్య, సంజన, కోమలి, సంగీత, అహల్య, సిహెచ్‌ గాయత్రి, యు.వైష్ణవి జి.అశోక్‌, వై జగన్‌, యు భార్గవ్‌లను ఎన్నుకున్నారు.

గాజువాక : పెదగంట్యాడ సిడబ్ల్యూసిలో విసిసి స్టీల్‌జోన్‌ మహాసభ జరిగింది. ఈసందర్భంగా జిల్లా కోఆర్డినేటర్‌ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పన, వేసవి శిబిరాలు నిర్వహణ, దేశభక్తి పెంపొందించడం, శ్రమ పట్ల గౌరవం, సమిష్టితత్వాన్నిపెంపొందించడం, సైన్స్‌, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం, ఇతరులకు సహాయ పడడం ప్రధానమైన లక్ష్యాలుగా విసిసి పనిచేస్తోందన్నారు.అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరగ్గా, పెద్దల నుంచి కన్వీనర్‌గా వై.సంధ్య, కో కన్వీనరుగా కె. ఎలమాజీ ఎంపిక కాగా, పిల్లల నుంచి ప్రెసిడెంట్‌ గా వర్షిణి, సెక్రటరీగా గ్రీష్మ, వైస్‌ ప్రెసిడెంట్‌గా వై. ఎల్లాజి, జాయింట్‌ సెక్రటరీగా కె..నేహ, మరో ఇద్దరిని సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో డి.వెంకటరావు, సిహెచ్‌ రాముడు, వెంకయ్య, ఐద్వా నాయకులు కామేశ్వరి, గుణ శంకర్‌, లక్కీ, యామిని పాల్గొన్నారు.

విశాఖ కలెక్టరేట్‌ : బాలల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని జెవివి నాయకులు చిలకా మూర్తి, విసిసి జగదాంబ జోన్‌ నాయకులు కె.మణి అన్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ (విసిసి) జగదాంబ జోన్‌ మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభలో వారు మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో పిల్లలు అత్యంత విలువైన వారని, నేటి బాలలే రేపటి పౌరులని చెప్పారు. అటువంటి పిల్లలు ఈ రోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పౌష్టికాహార లోపం, మత్తు, గంజాయి, మొబైల్‌కు బానిసకావడం, చదువు అయ్యాక ఉపాధి అవకాశాలు లేక నేర ప్రవృత్తి పెరుగుదల తదితరాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు విసిసి ప్రయత్నిస్తుందన్నారు. పిల్లల మధ్య స్నేహ భావం, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను పెంచడం సంస్కృతి, కళలు నేర్పించడం, క్రీడలను ప్రోత్సహించడం, ప్రకృతి పట్ల ఆసక్తి, పర్యావరణంపై అవగాహన పెంపొందించడం, శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, సమ్మర్‌ క్యాంపులు, మ్యాజిక్‌ షోలు నిర్వహించడం, దేశభక్తి, శ్రమ పట్ల గౌరవం, సమిష్టితత్వాని పెంపొందించడం, సైన్సు, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించడం, ఇతరులకు సహాయపడడం తదితర లక్ష్యాలతో విసిసి పనిచేస్తోందని చెప్పారు. ఈ లక్ష్యాల అమలు కోసం క్లబ్‌, జోన్‌ కమిటీలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మహాసభలో పంది మెట్ట ఆర్గనైజర్‌ మణి రిపోర్టు ప్రవేశ పెట్టారు. ఒక క్లబ్‌ స్థాయిలో బాలలకు నిర్వహించే కార్యక్రమాల ప్రణాళిక రూపొందించారు. అనంతరం విసిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నిక వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ (విసిసి) జగదాంబ జోన్‌ కమిటీని ఎన్నుకున్నారు కన్వీనర్‌గా సరోజినీదేవి, కో-కన్వీనర్‌గా ఎస్‌.సాయిజాహ్నవి పెద్దల నుంచి ఎంపిక కాగా, పిల్లల నుంచి ప్రెసిడెంట్‌గా అమిత్‌, సెక్రటరీగా సుజన, వైస్‌ ప్రెసిడెంట్‌గా ఐ.హసిని, జాయింట్‌ సెక్రటరీగా వి.లాస్య, కమిటీ సభ్యులుగా చందు, తరుణ్‌, ఎం.లిఖిత, భావ్యశ్రీ ఎన్నికయ్యారు. ఏరియా ఆర్గనైజర్లుగా కె.మణి, నందిని, సంధ్యనుఎన్నుకున్నారు.

ఎంవిపి కాలనీ : విసిసి మద్దిలపాలెం జోన్‌ మహాసభ శివాజీపార్కులో నిర్వహించారు. ఈ సందర్భంగా విసిసి జిల్లా కన్వీనర్‌ కె.సుశీల మాట్లాడారు. మహాసభలో డి.నీలవేణి రిపోర్టు ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి చంటి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కౌశిక్‌, ఐద్వా సభ్యులు కుమారి పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక మహాసభలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. పెద్దల విభాగం నుంచి నూతన కమిటీ కన్వీనర్‌గా ఎ.మణి, కో-కన్వీనర్లుగా డి.నీలవేణి, జి.గీతాంజలి, పిల్లల విభాగం నుంచి ప్రెసిడెంట్‌ కె.శ్రావణి, కార్యదర్శిగా వి.జయప్రసాద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా డి.శ్రీరాం, జాయింట్‌ సెక్రటరీగా బి.జస్వంత్‌ తదితరులు ఎన్నికయ్యారు.

ఎన్నికైన విసిసి భీమిలి జోన్‌ నూతన కమిటీ ప్రతినిధులు

➡️