అలరించిన నాటికలు

Jun 8,2024 00:18 #art, #kalabharathi
దొందూ దొందే నాటకంలోని ఓ సన్నివేశం

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ :

విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ – కళాభారతి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శించిన దొందూ దొందే, మట్టి పరిమళం నాటికలు వీక్షకులను అలరించాయి. వీటిలో దొందూ దొందే చక్కని హాస్యాన్ని అందించింది. మట్టి పరిమళం ఆసాంతం ఆకట్టుకుంది. ప్రతి నెలా మొదటి శుక్రవారం ప్రదర్శించే నాటికల్లో భాగంగా వీటిని ప్రదర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు. ముందుగా అకాడమీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రాంబాబు గుమ్ములూరి, కోశాధికారి పైడా కృష్ణ ప్రసాద్‌, డైరెక్టర్‌ డేవిడ్‌ రాజు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ స్థానిక నాటక సంస్థలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రమాణాల మేరకు ప్రదర్శనలకు సిద్ధపడి దరఖాస్తు చేసుకున్నట్లయితే స్క్రిప్ట్‌ పరిశీలించి బాగుంటే తప్పకుండా అవకాశ మిస్తామన్నారు. ఈ నెల 23న ప్రముఖ రచయిత, సాహిత్యపరంగా ఎంతో సేవచేసిన డాక్టర్‌ రామవరపు శరత్‌బాబుకు ‘సాహిత్య కళా భారతి’ బిరుదుతో పురస్కారం అందజేయ నున్నట్టు తెలిపారు. కళలను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తుచేశారు.

 

➡️