ప్రజాశక్తి-విశాఖ: అధిష్టాన్ పరిశ్రమలో గల బ్రాండిక్స్ 1,3 కార్మికులు ఈరోజు వేతనాలు పెంచాలని పరిశ్రమ లోపల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగావెళ్లిన సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చింతకాయల శివాజీ, చలపతిలను అక్రమంగా అరెస్టు చేసి తరలించడానికి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము ఖండించారు. కార్మికుల వేతనాలు పెంచాలని తదితర న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలని, నిర్బంధాలకు పూనుకుంటే కార్మికులు మరింత ఐక్యతతో పోరాడుతారని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన సీఐటీయూ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
