ప్రజాశక్తి -గాజువాక : గాజువాక ఆటోనగర్ ఆర్చి నుంచి సెయిల్ జంక్షన్ వరకు రహదారి విస్తరణకు ఎంఎస్‌ఎంఇ నిధులు కేటాయించాలని లో ఐలా చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సెక్రెటరీ చీకటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొల్లి ఈశ్వరరావు కోరారు. శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఆటోనగర్ ఆర్చి నుంచి సెయిల్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు రూ.12 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనాలు వేశారన్నారు. సరిపడా రోడ్డు లేకపోవడంతో గాజువాక ఆటోనగర్‌లోని వివిధ పరిశ్రమలకు వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు.దీనిపై కేంద్రమంద్రి రామ్మోహననాయుడు స్పందించి, వెంటనే ఎంఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్ కమిషనర్‌తో ఫోనులో మాట్లాడారు. ఐలా విజ్ఞప్తి మేరకు రోడ్డు విస్తరణకు నిధులు విడుదల చేయాలని కోరారు
కేంద్ర మంత్రిని కలిసిన ఐలా చైర్మన్