‘జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయం’

Jun 12,2024 00:20 #bvram, #telugusakti
'జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయం'

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే అనేక మంది వైసిపికి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బివి.రామ్‌ అన్నారు. మంగళవారం విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి నేతలు ప్రస్తుత పరిస్థితులలో శరణమా, రణమా అన్నది తేల్చుకోవాలని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సాక్షాత్తు నెల్లూరు మేయర్‌ వైసిపికి వీడ్కోలు పలికారని తెలిపారు. వైసిపిలో ముందు నుంచీ జగన్మోహన్‌ రెడ్డి నియంత పాలన కొనసాగిందని, కనీసం ఆ పార్టీ ముఖ్య నాయకులకు కూడా అపాయింట్‌మెంట్‌ లభించేదికాదని అన్నారు. పార్టీ అధినేతతో ఇతర నాయకులు కలవకుండా ధనుంజయ రెడ్డి అడ్డుకునేవారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లోనే ఆ పార్టీ పతన దిశగా సాగిందన్నారు.

మాట్లాడుతున్న రామ్‌

➡️