విశాఖ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు కలిసి ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు రోడ్ షో ప్రారంభమయింది. ఈ రోడ్ షోలో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొంటున్నారు. రోడ్డుకు ఇరువైపుల నిల్చున్న ప్రజలకు ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.