ప్రజల కోసం సిపిఎం ప్రజా చైతన్య యాత్రలను జయప్రదం చేయండి
ప్రజాశక్తి-విశాఖ: ప్రజల కోసం సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా స్థానిక సమస్యలపై ఈరోజు జగనన్న కాలనీలొ నివసిస్తున్న చోడపల్లి, రామన్నపాలెం మోసయ్యపేట, భోగాపురం, చీమలాపల్లి, అచ్యుతాపురం, జంగులూరు, గొర్లి ధర్మవరం,, మార్టూరు గ్రామాల ప్రజలకు ఇచ్చిన జగనన్న కాలనీలో వీధుల్లో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి సిపిఎం బృందం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలు కాలనీలో రోడ్లు, కాలువలు లేక వీధిలైట్లు సక్రమంగా నిర్వహణ చేయడం లేదని, చోడపల్లి కాలనీలో వాటర్ ట్యాంక్ లేక నీళ్లకు ఇబ్బందులు పడుతున్నామని, వెదరువాడ జగనన్న కొలని లో వారం రోజులుగా నీళ్లు సమస్య ఉందని జగనన్న ఇళ్లకు రూ.1,80,000 ఇవ్వాల్సి ఉండగా బకాయి బిల్లులు 60000 రావాలసి ఉందని చౌడపల్లి పంచాయతీలో కొంతమంది పట్టాలిచ్చి నేటికీ స్థలాలు చూపలేదని తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఇచ్చి పనులు కల్పించాలని, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న పథకాలు 1500, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం లాంటి పథకాలు ఇస్తే బాగుంటుందని, కరెంటు చార్జీలు తగ్గించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము మాట్లాడుతూ ప్రజలు తెలియజేసిన సమస్యలపై కార్యచరణ రూపొందించి భవిష్యత్తు పోరాటాలకు ప్రజలను సిద్ధం చేస్తామని వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రీ. అప్పారావు, మండల కమిటీ సభ్యులు అచ్చుతాపురం శాఖ కార్యదర్శి కే. సోమినాయుడు, ఆర్.లక్ష్మి, కర్రి రమణ, మోహన్రావు, అప్పారావు, శేషుబాబు, శ్రీనివాస్, భవాని, నాని తదితరులు పాల్గొన్నారు.