విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు

Nov 30,2024 13:12 #Visakha

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను కారణంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సగటున 6.0 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఉదయం తెలిపారు. ఇందులో అత్యధికంగా పెందుర్తిలో 11.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా ములగాడలో 1.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంతే కాకుండా ఆనందపురంలో 10.0, విశాఖపట్నం రూరల్ 9.0, భీమునిపట్నం 8.4 పద్మనాభం 8.2 సీతమ్మధార 6.4 మహారాణిపేట 4.2 పెదగంట్యాడ 2.8 గాజువాక 2.4 గోపాలపట్నం 1.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.

➡️