ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల కనీస పెన్షన్ పెంచాలి

Mar 10,2025 11:43 #in Visakhapatnam

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ : ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఇస్తున్న కనీస పెన్షన్ రూ.1000 చెల్లిస్తున్నారని దాదాపు 10 ఏళ్లగా ఇదే పెన్షన్ నేటికీ చెల్లించడం శోచనీయమని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విశాఖపట్నం రీజియన్ అధ్యక్షులు ఎం.ఈశ్వరరావు కార్యదర్శి ఎ.వి రావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అసోసియేషన్ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బడుగు బలహరి బలహీనవర్గాల వారికి ఇచ్చుచున్న వృద్ధాప్య పింఛన్ రూ.4000 కూడా తమకు కనీసం ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి ఎం జగ్గారావు, రీజినల్ కార్యదర్శి ఎ.వెంకటరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వివికె రాయ్ తదితరులు పాల్గొన్నారు.

➡️