ధరల నరకాసురుని వధ

Oct 30,2024 13:35 #Visakha

ధరలు తగ్గించాలని ఐద్వా నిరసన

ప్రజాశక్తి-విశాఖ : పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే అదుపు చేయాలని, బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా సప్లై చేయాలని, ఫ్యూచర్ ట్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధరల నరకాసురుని వధ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి. పద్మ, వై సత్యవతి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధరలు చూస్తే సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉప్పులు, పప్పులు, చింతపండు, బియ్యం, ఉల్లిపాయలు, టమాటా, కూరగాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయా యి. ప్రజలకి వస్తున్న ఆదాయానికి, ధరలకి అంతుపట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సర్వేలో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ 93.3 % మంది ప్రజలు ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఆకలితో ఎవరు పడుకోకూడదు అని, ఆకలి కారణంగా ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పింది. ఈ రెండు కూడా ప్రభుత్వ సంస్థలే చెప్పాయి. అయినప్పటికీ బీజేపీ టీడీపీ ప్రభుత్వాలకి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు గా ఉంది. చలనం అనేది లేదు. ఆహార ధాన్యాలు ఎఫ్ సి ఐ గోడెన్స్ లో నిల్వలు బాగా పెరుగుతున్నాయి. వాటిని రేషన్ డిపోల ద్వారా సప్లై చేయాలని, కేరళలో ఇస్తున్నట్టుగా 14 రకాల నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని ఐద్వా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని నిత్యా వసర వస్తువులు ధరలు అదుపు చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఈ ప్రభుత్వాలకు సరైన బుద్ధి చెప్తారని వక్తలు హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో R. వరలక్ష్మి, కె.అనురాధ, బొట్టా.ఈశ్వరమ్మ,బి. భారతి డి. కొండమ్మ, సుజాత, వి. ప్రభావతి, L. కామేశ్వరి, గీతాంజలి, కె.కుమారి, కె. చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

➡️