జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో శ్రీవిశ్వ విజయభేరి

Jun 10,2024 23:57 #JEE, #sri viswa
ర్యాంకులు సాధించిన వారితో శ్రీవిశ్వ కాలేజీ యాజమాన్యం

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ :

ఆదివారం విడుదలైన జెఇఇ అడ్వాన్స్‌డ్‌ -2024 ఫలితాలలో శ్రీవిశ్వ జూనియర్‌ కాలేజ్‌ విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. వివిధ కేటగిరీలలో 557, 627, 902, 950, 956, 1105, 1155, 1305, 1372, 1459, 1707, 2358, 2387, 2620, 2685, 2800, 2818, 2930, 3049, 3279, 3426, 3686, 3810, 3912, 4027, 4039, 4198, 4221, 4747, 4762 ర్యాంకులను సాధించారు. శ్రీవిశ్వ విద్యార్ధులు పి.ఆదిత్య 557, బి.షణ్ముఖ చరణ్‌ 627, పి.ప్రకాష్‌ 902, ఎం.యశస్వి 950, జె.శ్రవ్య 956 ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో 1000లోపు 5 ర్యాంకులు, 2000లోపు 11 ర్యాంకులు, 5000లోపు 32 ర్యాంకులు, 10000లోపు 49 ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా శ్రీవిశ్వ విద్యాసంస్థల చైర్మన్‌ ఆర్‌.ధర్మరాజు, డైరెక్టర్‌ పి.సూర్యనారాయణ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు.

 

➡️