ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విద్య చీకటి తెరలని చీల్చే దీపమని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే.రాంబాబు పేర్కొన్నారు. విప్పర్తి రామం- కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ విశ్వ చిత్రకళ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల పిల్లల పరీక్షా పరికరాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ విద్య ఊహించని విజ్ఞానాన్ని, సాధన సత్ ఫలితాలిచ్ఛే నైపుణ్యన్నీ అందిస్తుందాన్నారు. ఆందోళన చెందకుండా ఆలోచనతో రాసే పరీక్షలు చక్కని ఫలితాలను ఇస్తాయన్నారు. కళావేదిక గౌరవ అధ్యక్షులు కమల్ బైడ్ మాట్లాడుతూ సృజనత్మక ధోరణి, ధైర్యం చదువు తోనే సాధ్యం అన్నారు. ఇంచార్జి డి టి సి ఆర్. సి హెచ్ శ్రీనివాస్ రావు, ఆర్ టి ఒ ఎం.బుచ్చి రాజు, సింహాచలం దేవస్థానం ధర్మ కర్త ల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్స్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు కమల్ బెయిడ్ లు మాట్లాడుతూ నిత్యం సమాజాన్ని జాగృతి పరిచే వార్తలు అందించే జర్నలిస్ట్ పిల్లలు పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతూ దేశ, విధేశాల్లో పేరు ప్రఖ్యతలు సంపాదిస్తున్నారన్నారు. ఇటువంటి వారికీ ప్రోత్సాహకాలను, సత్కార్యాలను తాము చేశామన్నారు. విప్పర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వి. శ్రీనివాస జగన్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా పరీక్షల సమయంలో జర్నలిస్ట్ పిల్లలకు ఉచితంగా కిట్స్, అవసరమైన ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ స్వాగతపన్యాసం చేసిన కార్యక్రమంలో ఇటీవల అరుదైన లివర్ శాస్త్ర చికిత్స విజయవంతంగా చేసిన డాక్టర్ కే. రాంబాబును సత్కరించారు. అనంతరం 75 మంది బాలలకు పరీక్ష పరికరాలు అందించారు. కొణతాల శ్రీనివాస్, ఈశ్వర్, ప్రకాష్, సతీష్, పెద్ద ఎత్తున జర్నలిస్ట్ లు, వారి కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.
