పురుగులకూ ఒక భాష ఉంటుంది

ఇన్‌సెక్ట్‌ అకౌస్టిక్స్‌

ఇన్‌సెక్ట్‌ అకౌస్టిక్స్‌పై అధ్యయనం చేశాం

బెంగళూరు ఐఎస్‌సిఎస్‌ ప్రొఫెసర్‌ రోహిణి బాలకృష్ణన్‌

ప్రజాశక్తి -మధురవాడ : భూమిపైన శబ్ధం ద్వారా పరస్పరం సమాచారాన్ని తెలియజేసుకున్న జీవులు పురుగులేనని, దీనిపై పురుగుల శబ్దశాస్త్రం (ఇన్సెక్ట్‌ అకౌస్టిక్స్‌) ద్వారా అధ్యయనం చేసినట్లు బెంగుళూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ రోహిణి బాలకృష్ణన్‌ వెల్లడిరచారు. సోమవారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌, జీవశాస్త్ర విభాగంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ,. సంతానోత్పత్తి సమయంలో ఆడ పురుగులను ఆకర్షించడానికి మగ పురుగులు ధ్వని చేయడం ద్వారా సమాచారం పంపుతాయని, ఇవి ఒకొక్క జాతి పురుగులో ఒకొక్క రకమైన శబ్ధ భాష ఉంటుందన్నారు. దట్టమైన అడవులు, ప్రకృతిలో వివిధ జాతుల పురుగుల ధ్వని భాషలను తమ పరిశోధన బృందం రికార్డు చేసి విశ్లేషించిందన్నారు. నెమలి తన రెక్కలు విప్పి ఆకర్షించిన విధంగానే, పురుగుల మధ్య ధ్వని భాష ద్వారా తమ జాతిలోని ఇతర పురుగులను ఆకర్షించేందుకు వివిధ పద్దతులు పాటిస్తాయన్నారు. గుడ్లు పెట్టడానికి, ఆహరం వెతకడానికి ఒకే జాతి పురుగులు ధ్వని భాష ద్వారా సమాచారం చేరవేసుకుంటాయన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం, పరిశోధనలను చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.కృష్ణ, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.వేదవతి, స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ అధిపతి ప్రొఫెసర్‌ ఎన్‌.శ్రీనివాస్‌, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

➡️