నాటక రంగానికి విశ్వవ్యాప్త ఆదరణ

Jun 9,2024 00:56 #art, #rangasai
నాటకాల్లో శిక్షణ పొందినవారితో అతిథులు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

నాటక రంగానికి విశ్వవ్యాప్త ఆదరణ ఉందని పలువురు వక్తలు అన్నారు. నవరస థియేటర్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టిఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లోని రంగ సాయి నాటక గ్రంథాలయంలో శనివారం బాల బాలికల వేసవి నట శిక్షణా శిబిరం ముగింపోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన లీడర్‌ సంపాదకులు, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వివి.రమణమూర్తి మాట్లాడుతూ ఎపిలోనే నాటక రంగం పట్ల కాస్త చిన్నచూపు ఉందన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో నాటక థియేటర్లు ఉన్నాయని, నాటకం చూడడానికి టికెట్టు రూ.200 ఉంటుందని, నాటకం ప్రారంభానికి ముందుగానే టికెట్లు అమ్ముడు అయిపోతాయని తెలిపారు. అక్కడి ప్రభుత్వం కూడా నాటక రంగానికి మంచి గుర్తింపు ఇస్తోందన్నారు. అక్కడ పిల్లలకు నాటకానికి సంబంధించి పాఠశాలలోని క్లాసులలో ఒక తరగతి ఉంటుందని తెలిపారు. అది ఎపిలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. నేడు ఇక్కడ కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని ఆడిటోరియంలో ఇప్పటికీ నాటకాలు జరుగుతూ ఉంటాయని, టికెట్లు కొనుక్కొని ప్రేక్షకులు ఆసక్తితో వీక్షిస్తారని అన్నారు. ముఖ్యంగా నాటకాలను చూడడానికి యువత వస్తుంటారని చెప్పారు. ఆ నాటకాల్లో సామాజిక సందేశం ఉంటుందన్నారు. నాటకాల ద్వారా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చన్నారు. శ్రీదేవి, రోజారమణి వంటి వారు నాటకాలు వేసి బాల నటులుగానే సినిమా రంగంలోకి వచ్చారని గుర్తు చేశారు.

 

➡️