సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జె. వి సత్యనారాయణ మూర్తి
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం వక్ప్ సవరణ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని చెబుతున్నారని,ఇది పచ్చి అబద్ధం అన్నారు.వక్ఫ్ కు దేశవ్యాప్తంగా ఉన్న లక్షల కోట్ల విలువైన భూములను, కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడం కోసం చట్ట సవరణ తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎస్.కె రెహమాన్, సి.ఎన్ క్షేత్ర పాల్,ఎం.డి బేగం తదితరులు పాల్గొన్నారు.