విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల ఔదార్యం

గేదెల సత్యనారాయణ

నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం

ప్రజాశక్తి- వడ్డాది : విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇద్దరు నిరుపేద కుటుంబాల ఇళ్ల నిర్మాణాలకు తన సొంత నిధులతో ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. ఆదివారం కోమలపూడి పంచాయతీ బుదిరెడ్డిపాలెంలో . శోంఠ్యాన ఆచారి తన ఇంటి శ్లాబ్‌ పూర్తి చేయలేక అసంపూర్తిగా నిలిపేసి, పూర్తిచేయలేని దుస్థితిని గమనించిన విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ తన సొంత నిధులు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. అలాగే ఎన్నంశెట్టి ఏసు అనే వ్యక్తి ఇంటి మరమ్మతులకు మరో రూ.20వేలు ఆర్థికసాయం అందించారు. కష్టకాలంలో ఇంటి నిర్మాణాల కోసం ఆర్థిక తోడ్పాటు అందించిన గేదెల సత్యనారాయణ ఉదారతను లబ్ధిపొందిన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అభినందించారు

ఆర్థిక సాయం అందజేస్తున్న గేదెల సత్యనారాయణ

➡️