విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సెయిల్లో విలీనం చేయాలి : సిపిఎం-ప్రజా సంఘాలు

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరును నిరసిస్తూ సిపిఎం,ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటుపరం చేసే ఆలోచనను విరమించుకుని, స్టీల్‌ ప్లాంట్‌ ను సెయిల్‌ లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సిపిఎం, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ … ఆంధ్రులు హక్కు విశాఖ ఉక్కు అయినటువంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు వీరోచితంగా ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రాణ త్యాగం ఫలితంగా ఏర్పడిందన్నారు. వెల ఎకరాలు భూములు రైతులు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రములో ఆర్థికంగా,ఉద్యోగ పరణగా వెన్నుముకలా నిలిచిన స్టీల్‌ ప్లాంట్‌ ను బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు ఆస్తిని కార్పొరేట్‌ దోపిడీ దార్లుకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటుపరం చేయమని ఎందుకు ప్రకటించడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటుపరం చేయమని ప్రకటించే విధంగా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలని, సెయిల్‌ లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత ఘనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రెవేటికరణ కాకుండా పోరాడి కాపదుకుంటామన్నారు. వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం చేయమని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.నిరసన కార్యక్రమం లో సి ఐ టి యు నాయకులు ఏ.జగన్మోహనరావు, ఉత్తరాంధ్ర అభివఅద్ది వేదిక ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం శ్రీనివాస, ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము,వెంకటేష్‌, కే.వి పి ఎస్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌.ఆనంద్‌, డి వై ఎఫ్‌ ఐ జిల్లా కన్వీనర్‌ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️