ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు ఎంవిపి కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా మూడు రోజులపాటు నిర్వహించనున్న 10 వ క్రెడారు విశాఖపట్నం ప్రాపర్టీ ఎక్స్ పో 2024 కర్టెన్ రైజర్ వేడుక సోమవారం సాయంత్రం విశాఖలోని ప్రముఖ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, ఎస్ బి ఐ డివిజనల్ జనరల్ మేనేజర్ రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ బిజినెస్ యూనిట్ సీతకాశి సింగ్, ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ఈ ప్రాపర్టీ ఎక్స్ పో గణనీయమైన సంఖ్యలో సందర్శకులను, పెట్టుబడిదారులను రియల్ ఎస్టేట్ ఎస్టేట్ ఔత్సాహికులను ఆకర్షిస్తుందని అన్నారు. అనంతరం క్రెడారు ప్రెసిడెంట్ ధర్మేంద్ర కార్యదర్శి వి.శీను, చైర్మన్ కేఎస్‌ఆర్కే రాజు (సాయి) మాట్లాడుతూ స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాపర్టీ ఎక్స్ పో ఎంతగా ఉపయోగపడుతుందో దాని ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా ఈ ఎక్స్ పో లో అనేక రకాలైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అన్ని ఒకే చోట చేర్చే ప్రత్యేకమైన వేదికగా నిలుస్తుందని, సందర్శకులకు ఒకే చోట తమకు కావలసిన ప్రాపర్టీ ఎంచుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంటుందని అన్నరు. అభివఅద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఉత్తమమైన ప్రాపర్టీ కోరుకునే కొనుగోలుదారులకు, ఇక్కడి పెట్టుబడిదారులకు ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం అవుతుందని వారన్నారు. ప్రాపర్టీ ఎక్స్ పో కన్వీనర్ సి.హెచ్.గోవిందరాజు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్ సంబంధించి 80 స్టాల్స ఏర్పాటు చేయడం జరుగుతుందని కొనుగోలుదారుల అనుమానాలు నివఅత్తి చేసేందుకు పరిశ్రమ నుండి నిపుణుల ద్వార వఅత్తిపరమైన సలహాలు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు.
