విశాఖ క్రైమ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం లోగో ఆవిష్కరించిన విశాఖ సిపి

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి విశేష సేవలందిస్తున్న తెలుగు జర్నలిస్ట్స్‌ ఫోరం కు అనుబంధంగా విశాఖ క్రైమ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అడిషనల్‌ డీజీపీ డాక్టర్‌ శంఖ బ్రత బాగ్చీ చేతుల మీదుగా విశాఖ క్రైమ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం లోగో ను విష్కరించారు. ఆవిష్కరణ అనంతరం విశాఖ క్రైమ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం అధ్యక్షులు నంద కుమార్‌ , తెలుగు జర్నలిస్ట్స్‌ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు పి. ఈశ్వర్‌ చౌదరి లు మాట్లాడుతూ … ఇప్పటి వరకు తెలుగు జర్నలిస్ట్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని క్రైమ్‌ జర్నలిస్టులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు విశాఖ క్రైమ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఫోరం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడతామని జర్నలిస్టుల అభ్యున్నతికి కఅషి చేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని ఆయన వెల్లడించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్స్‌ లకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ క్రైమ్‌ జర్నలిస్ట్స్‌ ఫోరం వైస్‌ ప్రెసిడెంట్‌ యర్రంశెట్టి అనిల్‌, జాయింట్‌ సెక్రటరీ రవి, జ్యోతి, పలువురు తెలుగు జర్నలిస్ట్స్‌ ఫోరం సభ్యులు మండవ చౌదరి, అర్జున్‌, వెంకట రమణ, సురేష్‌, ప్రభాకర్‌ హాజరయ్యారు.

➡️