కన్నప్ప జన్మస్థలిని దర్శించుకున్న హీరో విష్ణు

ప్రజాశక్తి,-రాజంపేట అర్బన్‌ పరమేశ్వరుడు పరమ భక్తుడైన కన్నప్ప జన్మస్థలి మండల పరిధిలోని ఊటుకూరులో అడుగుపెట్టి శివ, పార్వతులతో పాటు కన్నప్పను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకతమని సినీ హీరో మంచు విష్ణు పేర్కొన్నారు. భక్త కన్నప్ప పాత్రలో విష్ణు కథానా యకుడిగా నటిస్తున్న సంద ర్భంగా శనివారం కన్నప్ప జన్మ స్థలమైన ఊటుకూరు గ్రామంలో వెలసిన మీనాక్షి సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని విష్ణు సందర్శించారు. ఊటు కూరు గ్రామస్తులు బాణాసంచా పేలుస్తూ, మేళ, తాళాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేం దుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆలయ ప్రాంగ ణానికి చేరుకున్నారు. సెల్ఫీ దిగేందుకు పోటీపడడంతో కోలాహలం నెలకొంది. రూరల్‌ సిఐ కులాయప్ప ఆధ్వర్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేయడంతో సమస్యలేవీ తలెత్తకుండా విష్ణు కన్నప్ప దర్శనాన్ని ప్రశాంతంగా ముగించుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు నాగ పథ్వీరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఫణి భూషణరావు విష్ణుచే ప్రత్యేక పూజలు నిర్వ హించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామి, భైరవుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలను సందర్శించి చివరగా కన్నప్పను దర్శించుకుని ప్రదక్షిణాలు చేశారు. అనంతరం విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్నప్ప పాత్రలో నటించడం, కన్నప్ప జన్మస్థలికి వచ్చి ఆయనను సంద ర్శించుకోవడం తనకు మాత్రమే దక్కిన భాగ్యమన్నారు. ఇంతటి విశిష్టమైన చరిత్ర కలిగిన కన్నప్ప ఆలయ అభివద్ధికి తన వంతు సహాయ సహకారాలు అంద జేస్తానని గ్రామ పెద్దలకు హామీ ఇచ్చారు. ఈ నెల 25న కన్నప్ప సినిమా విడుదల కానున్నదని, మహా భక్తుడైన కన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఈ చిత్రం చేశానన్నారు. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల ఉపాధ్యక్షులు ఆర్‌.సతీష్‌రాజు, ఊటుకూరు గ్రామస్థులు ఎం.లక్ష్మీకర్‌రెడ్డి, వి.రాజా, జె.నాగేశ్వరరాజు, ఆర్‌.శ్రీనివాసరాజు, ఎస్‌.నరసింహులు, జి.వెంకటయ్య, బి.సుబ్బరామరాజు, ఆర్‌.సుబ్బరాజు, ఎస్‌.లక్ష్మీనారాయణ, ఎం.నరసారెడ్డి పాల్గొన్నారు.

➡️