ఎపి యుటిఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నల్లి విశ్వనాధ్‌

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : ఎపి యుటిఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నల్లి విశ్వనాధ్‌ ఎన్నికయ్యారు. సఖినేటిపల్లి మండలానికి చెందిన విశ్వనాద్‌ యుటిఎఫ్‌ మండల కార్యదర్శిగా, అద్యక్షడుగా, జిల్లా కార్యదర్శిగా, యుటిఎఫ్‌ కుటుంబ సంక్షేమ పథకం జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యుటిఎఫ్‌ కార్యదర్శిగా అనేక సేవలు అందించారు. ఇటీవల జరిగిన యుటిఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … యుటిఎఫ్‌ బలోపేతంకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ బడులను బలోపెతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉపాద్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం యుటిఎఫ్‌ పని చేస్తుందన్నారు.

➡️