సునీత విలియమ్స్‌ కు స్వాగతం పలుకుతూ .. వివేకానంద విద్యార్థుల మానవహరం

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : 9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని భారత సంతతికి చెందిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ బారీ విల్మోర్‌ లు బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగిరానున్న నేపథ్యంలో … మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం లోని వివేకానంద విద్యార్థులు సునీత అంటూ మానవహారంగా ఏర్పడి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్‌ పి.వి.వి.వర ప్రసాద్‌ మాట్లాడుతూ … ఐఎస్‌ఎస్‌ లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదని, మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారని ఆమెను ప్రశంసించారు. ఒకొక్కసారి పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా ఆత్మస్థైర్యం తో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ విషయంలో సునీత విలియమ్స్‌ బృందం యావత్‌ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రతికూల వాతావరణం, పరిస్థితులలో కూడా అంతరిక్షంలో వ్యాయామం చేయడం మానలేదట ! అంటూ క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు అద్భుతాలు సాధిస్తారని తెలిపారు. సునీత యు ఆర్‌ గ్రేట్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️