విజయనగరం ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డి పి టి ఓ, సి. హెచ్‌. అప్పలనారాయణ తెలిపారు. మంగళవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ గ్యారేజీ వద్ద ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌ వద్ద హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న 16 వ బ్యాచ్‌ కు ప్రజా రవాణా అధికారి సిహెచ్‌ అప్పలనారాయణ సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మంచి డ్రైవర్స్‌ గా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న 17 వ బ్యాచ్‌ లో చేరడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరారు. డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు మంగళవారం ఈ ప్రకటన తెలిపారు. లైట్‌ వెహికల్‌ లైసెన్స్‌, ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరాలు నిండినవారు ఈ వెహికల్‌ లైసెన్స్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ కు అర్హులు. మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని తెలిపారు. వివరాలకు 9866649336 , 7382924030., 9959225620 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అండ్‌ డిపో మేనేజర్‌ జె.శ్రీనివాసరావు, డ్రైవింగ్‌ స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.ఎన్‌.రాజు పాల్గొన్నారు.

➡️