ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : భగత్‌సింగ్ జయంతి పురస్కరించుకొని మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రెసిడెంట్ జీ.గీతాకృష్ణ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో పోరాటస్ఫూర్తితో పాటు విజ్ఞానం, వినోదం కూడా ఉండాలన్నారు. నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్లకు అలవాటై, ఎంతో మంది విద్యార్థులు సాంప్రదాయ ఆటలకు దూరమై పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వినోదాన్ని పంచడానికి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. యువత, విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి, భవిష్యత్‌ను చక్కదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ సభ్యులు రాజు, మోహన్, స్వామి, వరహాలు, భార్గవ్, విష్ణు, జైకృష్ణ, రమణ, విద్యార్ధులు పాల్గన్నారు.
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు