ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆహ్వనపు వాలీబాల్ పోటీలలో విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీలలో మన జిల్లా జట్టు లీగ్ దశలో అనంతపురం, చిత్తూరు జట్లపై విజయం సాధించి పూల్ విజేత గా నిలిచింది.అదేవిధంగా క్వార్టర్ ఫైనల్స్ లో నెల్లూరు జట్టు పైన సెమీఫైనల్ లో కృష్ణా జిల్లా జట్టు పైన విజయం సాధించి ఫైనల్స్ కి చేరుకుంది. ఫైనల్స్ లో శ్రీకాకుళం జట్టు పై 2-1 తేడాతో విజయం సాధించి రాష్ట్రస్థాయి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన మన జిల్లా జట్టు రూ.50,000 నగదు బహుమతి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జట్టును అద్యక్షులు సూరిబాబు, కార్యదర్శి కే.వి.ఏ.యన్.రాజు మరియు వాలీబాల్ సంఘం సభ్యులు అభినందనలు తెలియజేసారు.
