వాలంటీర్లు రాజీనామా

Apr 17,2024 14:00 #resigns, #volunteers

ప్రజాశక్తి-విడవలూరు (నెల్లూరు) : పేద ప్రజలకు మద్దతుగా వై.యస్‌జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే ఆశయంతో కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించిన దాదాపు 200 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి విజయానికి మద్దతుగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బుచ్చినగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ మోర్ల సుప్రజ, బుచ్చి నగర అధ్యక్షులు టంగుటూరు మల్లికార్జున్‌ రెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ మూర్ల మురళి మరియు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

➡️