ఓటర్ల అవగాహాన మోటర్‌ సైకిల్‌ ర్యాలీ

Apr 1,2024 10:47 #awareness, #Motorcycle Rally, #voter

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : ఓటు హక్కు వినియోగించడం మన సామాజిక బాధ్యత అని, తప్పకుండా పోలింగు రోజున పోలింగు కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కలెక్టర్‌ కె.మాధవిలత తెలిపారు. సోమవారం రాజమండ్రి పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన మోటార్‌ సైకిల్‌ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ … ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్‌ ర్యాలీ నిర్వహించామని అన్నారు. మే 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగు ప్రక్రియ లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి జగదీష్‌, జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌, బిఎల్వోలు, పౌరసరఫరాల సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

➡️