డబ్బు కోసం ఓటర్ల ఎదురుచూపు!

గౌతమ్‌ బుద్ధ రోడ్‌ లోని శ్రీనివాస్‌ మహల్‌ వద్ద డబ్బులు కోసం ఎదురుచూస్తున్న ఓటర్లు

మంగళగిరి :  మంగళగిరి అసెంబ్లీ నియో జకవర్గంలో అధికార వైసిపి, ప్రతి పక్ష టిడిపిలు ఓటర్లకు డబ్బు చెల్లింపు విషయమై ఆయా పార్టీల నాయకులు గందరగోళం సృష్టి స్తున్నారు. అధినాయకులు పంపిం చినట్లుగా తమకు డబ్బులు ఇవ్వడం లేదని, వీధి వీధినా ఓటర్లు ఎదురుచూస్తున్నారు. సెకండరీ నాయకత్వానికి డబ్బులు పంపిణీ కార్యక్రమం అధినాయ కత్వం కేటాయించి నట్లుగా తెలిసింది. ఆ నాయ కత్వం ఓటర్లకు డబ్బులు ఇవ్వ కుండా వాళ్ళ పేర్ల ముందు రౌండప్‌ చేసి మీకు విచ్చేసినట్లుగా ఉందని చెల్లించకుండా వెళ్ళి పోతున్నారు. ఈ విధంగా అధి కార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పార్టీల ఓటర్లు ఆందోళన పడు తున్నారు. కొన్ని కొన్ని సెంట్రల్‌ నుండి ఆయా పార్టీ కార్యాలయా లకు వచ్చి డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదులు చేస్తు న్నారు. దీంతో పార్టీ నాయకులకు ఏం చేయాలో తలపట్టుకుంటు న్నారు. ఈ విధంగా పంపిణీ అల సత్వం వహిస్తే సోమ వారం ఓటు వేయడానికి కూడా రావడానికి కొంతమంది ఇష్టపడ డం లేదు. డబ్బు చెల్లిస్తేనే ఓటుకు వస్తామని మాటలు విన వస్తు న్నాయి. గతంలో ఈ విధంగానే మంగళ గిరి నియోజకవర్గంలో జరి గింది. సాయంత్రం నాలుగు గం టల తర్వాత డబ్బులు పంపిణీ జరిగిన తర్వాతనే ఓటు వేశారు. ఏదేమైనా ఎన్నికలు కొంతమంది దళారులకు డబ్బు కాజేసేందుకు ఉపయోగపడుతోంది.

➡️