అంబేద్కర్‌ విగ్రహానికి విఆర్‌ఎల వినతి

Apr 14,2025 22:00

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం అంబేద్కర్‌ విగ్రహానికి విఆర్‌ఎల సంఘం ఆధ్వర్యంలో నాయకులు వినతి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి మాట్లాడుతూ కేవలం 10,500 జీతంతో విఆర్‌ఎలు కుటుంబాలను పోషించుకోలేక పస్తులతో బతుకుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి విఆర్‌ఎలకు వేతనాలు పెంపుదలతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరించేలా మీ ద్వారా ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని కోరారు. తెలంగాణాలో మాదిరి విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేసి రూ.26 వేలు వేతనం ఇవ్వాలని, నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలని, నైట్‌ డ్యూటీలు రద్దు చేయాలని, అర్హులైన విఆర్‌ఎ లందరికీ ప్రమోషన్‌ కల్పించాలని, ఖాళీగా ఉన్న విఆర్‌ఎ పోస్టులు భర్తీ చేయాలనీ, భూసర్వేలు సందర్భంగా టిఎ, డిఎలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు, కెనప్రసాద్‌, పెడిరాజు, సన్యాసప్పుడు, రామప్పుడు, జయరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్‌ విగ్రహానికి వినతి చీపురుపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి చీపురుపల్లి మండల విఆర్‌ఎలు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలన్నారు. డిఎని జీతంతో కలిపి ఇవ్వాలని, నామినేలను విఆర్‌ఎలుగా గుర్తించాలని అన్నారు. నైట్‌ డ్యూటీలు రద్దుచేసి విఆర్‌ఎలకు ప్రమోషన్స్‌ను కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న విఆర్‌ఎ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. వీరికి చీపురుపల్లి బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ నాయకులు సబ్బి సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు.

➡️