ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ పట్టణానికి చెందిన విఆర్‌ఓ నరసింహారావు (49) శనివారం విధులు నిర్వహిస్తూ గుండె పోటుతో మృతి చెందారు. పెనుగంచిప్రోలు మండలం తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ విఆర్‌ఓ నరసింహారావు మృతిచెందారు. ఉదయం నుంచి తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఉండగా హార్ట్ స్ట్రోక్ రావటంతో కార్యాలయం సిబ్బంది 108 సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అప్పటికే నరసింహారావు మృతి చెందినట్లు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్థారణ చేశారు. తోటచర్ల గ్రామంలో విఆర్‌ఓ నరసింహారావు విధులు నిర్వహిస్తున్నారు. నరసింహారావు మరణవార్త విని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.