వరద బాధితులపై చెలరేగిపోయిన విఆర్‌ఓ

Sep 9,2024 17:13 #flood victims, #unleashed, #VRO

విజయవాడ : విజయవాడలో విఆర్‌ఓ వరద బాధితులపై చెలరేగిపోయింది. మంచినీరు, ఆహారం తమ వీధిలోకి అందలేదని ప్రశ్నించినందుకు… ఓ వ్యక్తి చెంప పగలగొట్టింది. అజిత్‌ సింగ్‌ నగర్‌ షాది ఖానా రోడ్డు 58వ డివిజన్‌ లో వరదలు వచ్చినప్పుడు నుంచి ఫుడ్‌ లేదు కనీసం వాటర్‌ సప్లయి కూడా లేదు, ప్రభుత్వం ప్రతి ఇంటికి ఫుడ్‌ అందించాలని చెప్పి తెలియజేస్తున్నప్పటికీ తమ సచివాలయం 259 వార్డు విఆర్‌ఓ విజయలక్ష్మి ని స్థానికులు ప్రశ్నించగా ఆవిడ కనీసం సమాధానం ఇవ్వకుండా దుర్భాషలాడుతూ పోలీసు సిబ్బంది ముందే బాధితుడిపై చేయి చేసుకుంది. పోలీసుల ముందే బాధితుడిని దుర్భాషలాడింది. పైగా నన్నే ప్రశ్నిస్తావా ? అంటూ చేతిలో ఉన్న ఫోన్‌ కు పని చెప్పింది. బాధితులపై అధికారులకు ఫిర్యాదు చేసింది. భోజనాలు, మంచినీరు అందటం లేదని ప్రశ్నించినందుకు ఇలా విఆర్‌ఓ వరద బాధితులపై చేయి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. వారం రోజులు పాటు వరద నీటిలో చిక్కుకొని తాగడానికి మంచినీరు , తినడానికి తిండి లేక ఈ ప్రాంత ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. తమ వీధిలోకి ఎందుకు రాలేదని అడిగిన బాధితులకు నచ్చ చెప్పాల్సిన విఆర్వో ఇలా సహనం కోల్పోవడం విమర్శలకు తావిస్తుంది . ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️