ప్రజాశక్తి-కారంచేడు : ఎస్‌సి వర్గీకరణ కోసం ఈనెల 7న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్‌పిఎస్ నాయకులు కోరారు. చలో హైదరాబాద్ కార్యాక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు బుడం గుంట్ల లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరణ కోసం ఈనెల 7న హైదరాబాదులో మందకష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగలందరూ జయప్రదం చేయాలని కోరారు. భారతదేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న అతిపెద్ద సాంస్కతిక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో దుడ్డు వందనం మాదిగ, జండ్రాజుపల్లి నాగరాజు, తేళ్ల పుల్లరాజు, కట్టెంపూడి యోహాను, దుడ్డు మోషే,తేళ్ల ఏరువాక, పుణేశ్ తదితరులు పాల్గొన్నారు.
