సామాజిక సేవలో భాగస్వాములు కావాలి

కోరమండల్‌ ఇంటర్నేషనల్‌

పారిశ్రామిక వేత్తలు, సంస్థలకు జిల్లా కలెక్టర్‌ పిలుపు

కోరమండల్‌ సౌజన్యంతో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

ప్రజాశక్తి-గాజువాక: సామాజిక సేవలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ హరింధిర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రభుత్వ మోడల్‌ ఐటిఐలో మురుగప్ప గ్రూపు, కోరమండల ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ సామాజిక బాధ్యతగా సిఎస్‌ఆర్‌ నిధులు రూ.34లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను జ్యోతిప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత కలెక్టర్‌ పిలుపుమేరకు రూ.32లక్షల అంచనాతో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కోరమండల సంస్థ, వ్యయం మరో రూ.రెండు లక్షలు పెరిగినప్పటికీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కోరమండల్‌ స్ఫూర్తితో మరిన్ని సంస్థలు సామాజిక సేవకు ముందుకు రావాలన్నారు. కంప్యూటర్‌ ల్యాబ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కోరమాండల్‌ వైస్‌ప్రెసిడెంట్‌, యూనిట్‌ హెడ్‌ ఎం.జ్ఞాన సుందరం, సిఎస్‌ఆర్‌ హెడ్‌ సి.జయగోపాల్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ ఆర్‌.శ్రీనివాసరావు, ఐటిఐ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌వి.రమణ, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, 65వ వార్డు కార్పొరేటర్‌ బి.నరసింహపాత్రుడు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి కోరమండల్‌ కృషి అభినందనీయం

గాజువాక : విద్యాభివృద్ధికి కోరమండల్‌ సంస్థ కృషి అభినందనీయమని గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గురువారం గాజువాక హైస్కూలులో మురుగప్ప గ్రూప్‌ కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సామాజిక బాధ్యతగా ఏర్పాటు చేసిన సైన్స్‌ లేబొరేటరీని ప్రారంభించారు.ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, దానిలో కోరమండల్‌ వంటి సంస్థలు సహకరించడం ప్రశంసనీయమన్నారు. కోరమండల్‌ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో డిఇఒ చంద్రకళ కోరమండల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.జ్ఞాన సుందరం, హెచ్‌ఆర్‌ డిజిఎం ఆర్‌.శ్రీనివాసరావు, సిఎస్‌ఆర్‌ హెడ్‌ సి.జయగోపాల్‌, డిప్యూటీ మేనేజర్‌ ఎస్‌ వెంకటరమణ, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, బిఎన్‌ పాత్రుడు,కరణంరెడ్డి నరసింగరావు, గూటూరు శంకరరావు, హెచ్‌ఎం విజయ ప్రశాంతి, పల్లా చినతల్లి పాల్గొన్నారు.సైన్స్‌ల్యాబ్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా

➡️