ప్రజాశక్తి-మద్దిపాడు : కుట్రలో భాగమే వక్ఫ్ సవరణ బిల్లు అని సిపిఎం జిల్లా నాయకుడు కాలం సుబ్బారావు తెలిపారు. మద్దిపాడులోని శ్రీ నటరాజ కళా కేంద్రంలో కనపర్తి సుబ్బారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ ముస్లింల మనోధైర్యాన్ని దెబ్బ కొట్టేందుకు వక్ఫ్ బిల్లును సవరణ అని తెలిపారు. వక్ఫ్ చట్టంలో ఇతరులకు ప్రవేశం కల్పించారన్నారు. దీని వల్ల వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. వక్ఫ్ ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డులో జోక్యం చేసుకుంటున్నామని చెబుతుందని నిజానికి అది అవాస్తమన్నారు. బిజెపి ఎంపీల్లో ఒక్క ముస్లిం కూడా లేరన్నారు. అలాంటి బిజెపి ముస్లింల పరిరక్షణకు పాటుపడతామని చెప్పను ముమ్మాటికి వారిని మోసం చేయటమేనన్నారు. హిందుత్వవాదులు ముస్లిలపై ఆధిపత్యాన్ని సంపాదించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనివలన మత స్వేచ్ఛకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తరువాత క్రిస్టియన్ ఆస్తులపై కూడా ఇదే రకమైన వైఖరిని ప్రదర్శిస్తుం దన్నారు. అనంతరం బిజెపి అనుసరిస్తున్న విధానాలను పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆదిలక్ష్మి, సుభాన్, షరీఫ్, జాన్ ఫీరా, వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, కాకుమాను సుబ్బారావు, కటకం వెంకటేశ్వర్లు, యలమంద, గంగిశెట్టి నరసింహారావు, అనంతలక్ష్మి, రామారావు తదితరులు పాల్గొన్నారు
