ప్రజాశక్తి – కడప వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించాలని ఇండియా కూటమి నాయకులు పేర్కొన్నారు. శనివారం వారు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ అంటే దైవార్పితమైన ఆస్తి, రాజులు,నవాబులు, ధనవంతులు వక్ఫ్ కోసం భూములు ఆస్తులు వందల సంవత్సరాలుగా దానంగా ఇస్తున్నారని చెప్పారు. వక్ఫ్ Û ఆస్తుల ఆదాయాన్ని విద్యాసంస్థలు, శ్మశానవాటికలు, మసీదులు, అనాధ శరణాలయాలు తదితర వాటి నిర్వహణకు వినియోగిస్తారు అన్నారు. ఇది ముస్లిం మైనారిటీలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 1954లో కాంగ్రెస్ పార్టీవక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చి బోర్డు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆర్మీ, రైల్వేల తర్వాత ఎక్కువ భూములు ఉన్నది వక్ఫు బోర్డుకే అని తెలిపారు. ఇప్పటికీ బిజెపి ప్రభుత్వం పౌరసత్వ చట్టం, ఉమ్మడి పౌరస్మతి, ట్రిపుల్ తలాక్, కాశ్మీరులో ముస్లిములకు ఉపయోగపడే ఆర్టికల్ 370 రద్దు లాంటి చట్టాలు చేసింది అన్నారు. ఇప్పుడు సవరణ బిల్లు ద్వారా ముస్లిములను ఆర్థికంగా బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. ఈ బిల్లు పూర్తిగా మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్నారు. అదానీ, అంబానీ లాంటి వారికి దారాదత్తం చేయడం కోసమే అన్నారు. ఈ బిల్లు విషయంలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, జనసేన పార్టీలు తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలన్నారు నేడు వక్ఫ్, రేపు గురుద్వారాలు, చర్చీల ఆస్తులు, తరువాత దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కార్పొరేట్ల వశం చేయటానికే ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే జిల్లాలోనూ, రాష్ట్రంలోను, దేశంలోనూ, వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని వాపోయారు. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎఐసిసిసి కో- ఆర్డినేటర్ ఎస్.ఎ. సత్తార్, నగర అధ్యక్షులు అఫ్జల్‌ఖాన్, కడప అసెంబ్లీ నియోజకవర్గం కో- ఆర్డినేటర్ బండి జకరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శిగాలి చంద్ర, సిపిఐ ( ఎం ఎల్) జిల్లా కన్వీనర్-బందెల ఓబయ్య, ఆప్ జిల్లా ఇన్‌ఛార్జి డాక్టర్ శ్రీనివాసులు, బిఎస్‌పి జిల్లా ఇన్‌ఛార్జి గురప్ప, రెెవెల్యూషనరి సోషలిస్ట్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు సిరాజుద్దీన్, హమీద్, హరి ప్రసాద్ పాల్గొన్నారు.
