నీటి పన్ను వసూలు చేయాలి

ప్రజాశక్తి – చీరాల:  నీటి పన్నులు సక్రమంగా వసూలు చేయా లని, నీటిని ప్రతిరోజూ పరీక్షించాలని మున్సిపల్‌ కమిషనర్‌ సయ్యద్‌ రషీద్‌ సిబ్బందిని ఆదేశిం చారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వార్డు శానిటేషన్‌ మరియు ఎన్విరాన్మెంట్‌ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రోజువారీ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ట్రేడ్‌ లైసెన్సు నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించారు. అనంతరం వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలకు ఇంటి, ఖాళీ స్థలము, కుళాయి పన్నులను నూరుశాతం వసూలు చేయాలని, మార్కెట్లకు సంబంధించి లీజులు, షాపు రూము లకు సంబంధించి అద్దెలు ఆలస్యము లేకుండా వసూలు చేయవలసినదిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ అది కారి, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. కారంచేడు రోడ్డు 31వ వార్డులో డ్రైనేజీ గ్యాంగు వర్కు ద్వారా సిల్టు తీసే పనిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఇంజనీరు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ మేస్త్రీలు పాల్గొన్నారు.

➡️