అల్లర్లకు పాల్పడ్డ వారి కోసం వెతుకుతున్నాం

 రెంటచింతల: చట్టం ఎవరికి చుట్టం కాదని తప్పు చేసిన వారు ఎంతటి వారికైనా శిక్ష తప్పదని, చట్టం దృష్టిలో ప్రజలంతా సమానమేనని అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) జీవీ రమణమూర్తి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం స్టేషన్‌ ఆవ రణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్ర తలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చ రించారు .రెంటాల,తుమ్మరకోట, పాల్వాయి గేటు, జెట్టిపాలెం, గోలి తదితర గ్రామాల్లో పోలింగ్‌ రోజు జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 34 మందిని అరెస్టు చేశా మని, మరో 36 మంది కోసం వెతుకు తున్నామని, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసునులు నమోదు చేశామన్నారు. పోలింగ్‌ రోజున జరిగిన సం ఘటనలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయని, రెంటాలలో కార్బన్‌ సెర్చ్‌ నిర్వహిం చగా ముళ్ళ పొదల్లో కర్రలు లభ్యమైనట్లు చెప్పారు. సరైన పత్రాలు లేని ఐదు వాహనాలు, మోటార్‌ సైకిల్‌, ఒక ఆటోను సీజ్‌ చేశామన్నారు కార్డన్‌ సెర్చ్‌ ప్రతిరోజు ఉంటుందని, గ్రామీణలో ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహిస్తున్నా మన్నారు. రెండు లేదా మూడు కేసుల్లో నింది తులుగా ఉంటే రౌడీ షీట్‌ ఓపెన్‌ చేయనున్నట్లు ప్రకటించారు. పది గ్రామాల్లో చెక్‌ పోస్ట్‌లు కొన సాగుతూనే ఉన్నాయన్నారు. సమావేశంలో గురజాల డిఎస్పి పి.వెంకటేశ్వరరావు ఎస్‌ఐ ఎం. ఆంజ నేయులు పాల్గొన్నారు.

ఈసి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

 తెనాలిరూరల్‌ : ప్రశాంత వాతావరణంలో ఓట్లు లెక్కిం పు జరగాలని తెనాలి ఒకటవ పట్టణ సిఐ దశరథ రామారావు తెలిపారు. ఓట్లు లెక్కింపు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛ నీయ సం ఘటనలు తలెత్తకుండా ఆది వారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. చినరావూరులో నిఘా ఏర్పరిచినట్లు తెలి పారు. ఈసి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. తెనాలి డిఎస్పి ఎం రమేష్‌ పర్యవేక్షణలో వన్‌ టౌన్‌ ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి

పొన్నూరు:  రానున్న ఎన్నికల ఫలితాల దృష్ట్యా పొన్నూరు పట్టణంలో శాంతి భద్రతలకు ప్రజలు ప్రజలు సహకరించాలని పొన్నూరు అర్బన్‌ పిఐ పి.భాస్కర్‌ కోరారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని పెట్రోల్‌ బంకుల యజమానులు పెట్రోల్‌ విడిగా క్యాన్లలో గాని, బాటిళ్లలో విక్రయించడానికి అనుమతి లేదని చెప్పారు. టపాసుల దుకా ణాల యజమానులు ఎవరికైనా అధిక మొత్తంలో విక్రయిస్తే ఆ సమాచారం ఇవ్వా లని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

చట్టపరమైన చర్యలు తప్పవు

 చేబ్రోలు: ఎన్నికల ఫలితాల రోజున శాంతి భద్ర తలపై వేజెండ్లలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు పలు సూచనలు చేసినట్లు ఎస్‌ఐ పి.మహేష్‌కుమార్‌ తెలిపారు. ఫలితాలు వెలు వడే వరకు ఎటువంటి గొడవలు జరగ కుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. పెట్రోల్‌/ డీజిల్‌ బంకు నిర్వా హకులకు అమ్మకాల విషయంలో నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

➡️