ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : నకిలీ విత్తనాలతో నష్టపోతున్నాం.. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను కోరారు. శనివారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నంద్యాల రూరల్ మండలం పాండురంగాపురం గ్రామంలో కల్తీ విత్తనాల వలన పంట నష్టం జరిగిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందించాల్సిందిగా నంద్యాల భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తూము శివారెడ్డి సూపుల రామచంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, నంద్యాల బిజెపి రూరల్ మండల అధ్యక్షులు గురుబ్రహ్మం లు కలెక్టర్ రాజకుమారి గణియాను జిల్లా వ్యవసాయ అధికారి వై. మురళి కృష్ణాలను వేరు వేరుగా కలిసి వినతి పత్రం అందజేశారు. నకిలీ విత్తనాల వలన తీవ్రంగా పంటలు నష్టపోతున్నామని, విత్తన డీలర్లు రైతులను మోసం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.ఈ కార్యక్రమంలో పాండురంగరాపురం గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.