గ్రంథాలయంలో ‘చదువంటే మాకిష్టం’

Jun 9,2024 21:25

ప్రజాశక్తి- డెంకాడ : స్థానిక శాఖా గ్రంథాలయంలో ప్రతి ఆదివారం నిర్వహించే చదువంటే మాకు ఇష్టం కార్యక్రమాన్ని ఈ ఆదివారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లైబ్రేరియన్‌ మహేశ్‌ కథల పుస్తకాలను చదివించారు. అనంతరం విద్యార్థులు చెస్‌, కేరమ్స్‌, లూడో, స్నేక్‌ అండ్‌ లేడర్‌ వంటి ఇండోర్‌ క్రీడలను ఆడించారు.విద్యతో పాటే ఆటలు శృంగవరపుకోట: విద్యతో పాటే మెదడుకు పదును పెట్టే ఆటలు అవసరమని శాఖ గ్రంథాలయ అధికారి దామోదర్‌ శ్రీధర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రతిరోజు నీతి కథలు చదివించడం, కథలోని నీతులు చెప్పించడం, చదరంగంలో మెలకువలను నేర్పించడం, కేరం బోర్డు వంటి ఆటలను ఆడించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.

➡️