ప్రజాశక్తి- కలకడ: కూలీలు అడిగిన చోటనే పనులు కల్పించడం జరుగుతుందని ఏపీవో చెన్నకేశవులు తెలిపారు.మంగళవారం మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పనులు కనిపించి దేశంలో కూలీలకు బాసటగా నిలిచిందని తెలిపారు. ఉపాధి పనులు చేసుకోదలచిన వారికి జాబ్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాలు ఉపయోగించుకొని ప్రతి కూలి ఉపాధి పొందగలగాలని సూచించినట్టు తెలిపారు. మండలంలోని గుడిబండ పంచాయతీ ఎల్లం గుడిబండలో జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పనిలో నాణ్యత ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్, కూలీలు పాల్గొన్నట్లు తెలిపారు.
