ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాదార్లకు అండగా ఉంటాం

Oct 10,2024 00:03

సమస్యను ఎమ్మెల్యేకు చెబుతున్న బాధితులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
ఐసిఐసిఐ బ్యాంకుల్లో మూడేళ్లుగా భారీ ఎత్తున గోల్‌మాల్‌ జరుగుతుంటే యాజమాన్యం, ఉన్న తాధికారులు ఎందుకు పసిగట్టలేక పోయారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు న్రపశ్నించారు. బ్యాంకును బుధవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ అక్రమల్లో స్థానిక బ్రాంచి సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు కనిపిస్తోందని అన్నిరు. మేనేజర్‌, గోల్డ్‌ అప్రైజర్‌ మోసానికి ఖాతాదారులు బలయ్యారని, చిలకలూరిపేట, నరసరా వుపేట, విజయవాడ బ్రాంచ్‌ల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలతో పాటు పెళ్లిళ్లు, ఇళ్లు, ఇతర అవసరాలకు దాచిపెట్టుకున్న వాళ్లను నమ్మకాన్ని ఇంతగా దెబ్బతీయడం బాధ కలిగిస్తోందన్నారు. ఇప్పటివరకు 100 మంది బాధితులు వచ్చారని, 76 మంది ఫిర్యాదు చేశారని ఆర్‌ఎం చెప్పారన్నారు. ఆధారాలు లేకుండా ఎవరైతే నగదు ఇచ్చారో వాటిపైనా విచారణ జరిపిస్తామని చెప్పారన్నారు. బ్యాంకుపై ఒత్తిడి తెచ్చి వారికి న్యాయం జరిగేలా చేస్తామని, ఒక్కరికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదని అన్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారని, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో తాను మాట్లాడతానని చెప్పారు. ఇది తప్పకుండా సీబీఐకి కూడా వెళ్లాల్సిన అవసరం ఉందనిన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, సిఎం చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లి విచారణ జరపాలని కోరుతా మన్నారు. రూ.వందల కోట్లలో మోసానికి పాల్పడి ఉంటారని, బాధితులందరికీ బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

➡️