జీడిపిక్కలు ఫ్యాక్టరీ తెరిపించాలని మనవహారం

Nov 27,2024 18:30 #Kakinada

ప్రజాశక్తి – ఏలేశ్వరం: గత నెల 16వ తేదీన అర్ధాంతరంగా మూసివేసిన మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక బాలాజీ సెంటర్లో బుధవారంమానవహారం నిర్వహించారు. కార్మికులు తొలుత తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా బాలాజీ చౌక్ సెంటర్ కు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా చేరుకుని మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా మండల సిపిఎం కార్యదర్శి పాకలపాటి సోమరాజు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రంగుల ఈశ్వరరావు మాట్లాడుతూ గత 12 రోజులుగా కార్మికులు అనేక విధాల ఆందోళనలు చేస్తున్న యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ చీమకుట్టినట్టు లేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తామని హామీలు ఇచ్చారన్నారు. ఫ్యాక్టరీ ముతపడి 409 మంది కార్మికుల రోడ్డున పడినందున వెంటనే తెరిపించవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి వీరబాబు కే. చక్రధర్, ఎం చంటి, సిహెచ్ గోవింద్,ఎస్ జయలక్ష్మి వై శివలక్ష్మి జే భాగ్యలక్ష్మి టి దేవి బి అన్నపూర్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

➡️