పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం

ప్రజాశక్తి – గిద్దలూరు: పేదలందరికీ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గహానిర్మాణ శాఖ, నగర పంచాయతీ కమిషనర్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజానగర్‌లో నిర్వహించిన ‘మన ఇళ్ళు – మన గౌరవం’ కార్యక్రమంలో భాగంగా రాజానగర్‌లో గహ నిర్మాణ లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ మాట్లాడుతూ నాడు వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి పేద ప్రజలకు తానే ఇళ్ళు కట్టిస్తానని చెప్పి మోసం చేశారన్నారు. కాలనీల్లో కనీసం మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. తెలుగుదేశం హయాంలో పేద ప్రజల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్‌ రెడ్డి పేద ప్రజలపై అక్కసుతో లబ్ధిదారులకు అందకుండా నిలిపివేశారన్నారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రన్న కూటమి ప్రభుత్వం లబ్దిదారుల గహాలపై ఎటువంటి పక్షపాతం లేకుండా, ఇళ్లు నిర్మించుకున్న కాలనీల్లో మౌలిక వసతులు, తాగునీరు, రోడ్డు నిర్మాణాలు, విద్యుత్‌ దీపాలు వంటి వసతులను కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ లే అవుట్‌లలో లబ్ధిదారులు నిర్మాణాలను డిసెంబర్‌ నాటికీ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్‌ పాముల వెంకట సుబ్బయ్య, 2వ వార్డు కౌన్సిలర్‌ బూనబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌, నగర పంచాయతీ కమిషనర్‌ వెంకటదాసు, హౌసింగ్‌ ఈఈ శర్మ, డీఈ ఖదీర్‌ బాషా, ఎమ్మార్వో ఆంజనేయ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్‌ శానేశావలి, బిల్లా రమేష్‌, పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, లోక్కు రమేష్‌, దేమా శ్రీరాములు, గడ్డం భాస్కర్‌ రెడ్డి, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

➡️