సైనికులకు సహకారమందిస్తాం

ప్రజాశక్తి-గిద్దలూరు: సైనికులకు, మాజీ సైనికులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆంధ్ర, తెలంగాణ సబ్‌ ఏరియా జీఓసీ మేజర్‌ జనరల్‌ రాకేష్‌ మనోజ్‌ అన్నారు. పట్టణంలోని సైనిక వైద్యశాల, సైనిక క్యాంటిన్లను ఆయన మంగళవారం పరిశీ లించారు. అనంతరం సైనికులు, మాజీ సైనికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. మాజీ సైనికులు మాట్లాడుతూ పట్టణంలో శాశ్వత సైనిక వైద్యశాల ఏర్పాటు కోసం త్వరగా నిధులు మంజూరు చేయించాలని, అలాగే సైనిక క్యాంటిన్‌ సామర్థ్యాన్ని పెంచాలని తదితర సమస్యలు విన్నవించారు. వాటన్నింటినీ త్వరలో పరిష్కారమయ్యేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్‌ కల్నల్‌ ఓం ప్రకాష్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినోద్‌ కన్వాన్‌, సైనికులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

➡️