పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంచుతాం : ఎస్‌పి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ పోలీస్‌ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని ఎస్‌పి వి.హర్షవర్ధన్‌ రాజు పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశిం చారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై విస్తతంగా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలన్నారు. ఇటీవలి కాలంలో బహిరంగ మద్య పానంపై నిఘాతో నేరాల శాతం బాగా తగ్గడంతో పాటు ప్రజల నుంచి డయల్‌ 100కు వచ్చే ఫిర్యాదులలో గణనీయమైన తగ్గుదల నమోదయిందని పేర్కొ న్నారు. సమాజంలో నేరాల శాతం తగ్గినపుడు ప్రజలు తాము సురక్షితంగా ఉన్నామనే భావన కలుగుతుందన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరగ కుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజిబుల్‌ పోలీ సింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు క షి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఆయా ప్రాంతాలలోని ప్రజల నుంచి సమాచారం తీసుకుని దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దష్టి సారించి అత్యధిక ప్రాధాన్యతతో ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్‌పి జి.వెంకట రాముడు, జిల్లాలోని డిఎస్‌పిలు, సిఐలు పాల్గొన్నారు.

➡️