ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ప్రజలకు, లబ్ధిదారులకు అందరికీ అందుబాటులో ఉంటూ గూడు కల్పిస్తాం. ఇల్లు నిర్మిం చిన వారందరికీ వారి ఖాతాల్లో ఇప్పటికే డబ్బులు చెల్లించాం. జిల్లాలో గూడు లేని వారు ఉండకూడదనే తమ లక్ష్యమని గహ నిర్మాణ శాఖ పీడీ ఎస్. వి. శివయ్య పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో లబ్ధిదా రులకు గహ నిర్మాణం, బిల్లులు ఏ విధంగా ఇవ్వాలో, జిల్లాలో గహ నిర్మాణ శాఖ ద్వారా జరిగిన, జరగబోయే పనులు గురించి ఆయన ప్రజాశక్తి ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు.జిల్లాల గహ నిర్మాణ శాఖ కార్యాలయాల వివరాలు తెలియజేయండి? అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రాయచోటి రాజంపేట, మదనపల్లె డివిజన్లలో గృహ నిర్మాణశాఖ కార్యాల యాలున్నాయి. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లి, పీలేరు, తంబలపల్లె ప్రాంతాల్లో డిఇలున్నారు. మండలానికి ఒక్కొకరు చొప్పున 30 మండలాలకు ఎఇలు, 22 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు.జిల్లాలో ఐదేళ్ల కాలంలో ఎన్ని గహాలు మంజూరు అయ్యాయి? ఎన్ని పూర్తయినాయి? జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు 79,721 గహాలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 36, 974 గహా నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన 34, 083 గహాలు వివిధ దశలలో ఉన్నాయి. ఇప్పటివరకు మొదలు పెట్టనవి 12,946 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ. 858 కోట్లు చెల్లించాం. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఎలా అందిస్తారు? లబ్ధిదారులకు కేటాయించిన గహాలు పూర్తి చేసిన వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చెల్లించడం జరుగుతుంది. గృహాలు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలి. కొత్తగా గృహాలు మంజూరు కావాలంటే లబ్ధిదారులకు ఎలాంటి అర్హతలుండాలి? లబ్ధిదారులు అదే గ్రామంలో నివాసం ఉంటూ, భార్యాభర్తలు ఆధార్‌కార్డులు, రేషన్ కార్డు ఉండాలి. ఇంకా బ్యాంక్, ఫోన్ నెంబర్ లింకు ఉన్నటువంటి అకౌంట్లు, ఆదాయ దృవీకరణ పత్రం, పానుకార్డు, లబ్ధిదారుల సంతకం, ఫోన్ నంబర్ తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేసి గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో అందజేయాలి. జిల్లాలో గతంలో ఎన్ని లే అవుట్లు ఎన్ని ఉన్నాయి? జిల్లా వ్యాప్తంగా 342 లే అవుట్లు, కాలనీ లున్నాయి. ఇప్పటికే చాలా లే అవుట్లలో గృహాలు నిర్మిం చుకుని నివాసముటున్నారు. ఇంకా కొన్ని కాలనీల్లో వివిధ దశలలో గృహ నిర్మాణాలు జరుగు తున్నాయి. నూతన గహాలకు కోసం సంబంధించిన లబ్ధిదారులు ఎక్కడ సంప్రదించాలి? నూతన గహాల కోసం దగ్గర్లో ఉన్న గ్రామ సచివాలయం, లేదా మండల గహ నిర్మాణ శాఖ కార్యాలయంలో పైన తెలిపిన పత్రాలు తీసుకొని సంబంధింత అధికారులకు సంతకం చేసి ఇవ్వాలి. గహ నిర్మాణ శాఖ అస ిస్టెంట్ ఇంజినీర్ ఆఫీసులో కానీ, సంబ ంధిత సచివాలయంలో కానీ మాత్రమే నివాస గహం కోసం దరఖాస్తు చేసు కోవాలి. ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. అట్లు ఎవరైనా డబ్బులు అడిగితే వారు నివసిస్తున్న నియో జకవర్గం ఎమ్మెల్యేకు కానీ, అధికారులకు కానీ ఫిర్యాదు చేయాలి.