ప్రజాశక్తి – కడప జిల్లా వ్యాప్తంగా గోతులు పడిన రహదారు లకు మరమ్మతులు చేపట్టి గుంతల రహిత జిల్లాగా తీర్చిది ద్దుతామని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక వై జంక్షన్ కూడలి వద్ద ‘గుంతల రహిత రోడ్లు’లో భాగంగా అధికారులతో కలిసి కడప నియోజకవర్గంలో ఎన్‌హెచ్-18 కడప రేణిగుంటను కలిపే రహదారి దగ్గర ప్యాచ్ వర్క్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రహదారుల మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం రూ.290.40 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాకు 15.90 కోట్లు నియోజకవర్గాల వారిగా మంజూరు చేశారని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి జిల్లాల్లోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎస్‌సి జి.చంద్ర శేఖర్, ఇఇ నాగేశ్వర్‌రెడ్డి, డిఇలు ఎఇలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కమ్మవారిపల్లె పంచాయతీలోని గొర్లపల్లె లో రూ. 15 లక్షలతో బిటి రోడ్ ప్యాచింగ్ పనులను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో రోడ్ల పైన ప్రయా ణాలు అంటేనే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే వారని, ఎక్కడ చూసినా రోడ్లు గుంతలతో దర్శనమిచ్చేవని చెప్పారు. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపె ట్టారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ టి.వి. కష్ణారెడ్డి పాల్గొన్నారు.