ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మతోన్మాద శక్తుల నుంచి లౌకిక భారత దేశాన్ని కాపాడుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు అన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, మతసామరస్యం, రాజ్యాంగ పరిరక్షణకై దేశ వ్యాప్తంగా సిపిఎం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం పూల్ బాగ్, డాబతోట, గాజులరేగ, తదితర చోట్ల ప్రచారం చేపట్టారు. మతోన్మాద చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.రామచంద్రరావు, రామలక్ష్మి పాల్గొన్నారు.