పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తాం

ప్రజాశక్తి-బాపట్ల : పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ అధికారి డిఎన్‌. మోహనరావు తెలిపారు. స్థానిక ఎన్‌జిఒ హోంటో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులత అసోసియేషన్‌, బాపట్ల తాలూకా యూనిట్‌ ఆధ్వర్యంలో పెన్షనర్స్‌ డే బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌ రావు మాట్లాడుతూ కమ్యూటేషన్‌ రికవరీ నిలుపుదలకు ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. పెన్షనర్ల సాధారణ సమస్యలైన ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి పుట్టిన తేదీ, పేరులో సవరణల పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వస్తాయని అని తెలిపారు.తొలుత డిఎస్‌ నఖారా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పెన్షనర్స్‌ సంఘం డైరీ, క్యాలెండర్‌ ను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్‌ పెన్షనర్లు టి.వెంకటరంగం, ఎల్‌.మాణిక్యరావ్‌, విశ్వేశ్వరరావు, శివబ్రహ్మం, టి. వల్లయ్య, మహదేవ్‌, కష్ణ ప్రసాద్‌, వీరభద్రయ్య, కె. శైలజను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు వైవి. నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులు పిఎస్‌ఎస్‌ఎన్‌పి.శాస్త్రి, రాష్ట్ర కార్యదర్శులు బి. లవ్‌కుమార్‌, ఎన్‌. నారా యణ, జిల్లా ఖజానా అధికారి జగన్నాథరావు, ఎటిఒ ఎస్‌. అనురాధ, ఉప ఖజానా అధికారి ఎన్‌. అనూరాధ పాల్గొన్నారు.

➡️