ప్రతి పంచాయతిల్లో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం

Apr 4,2024 16:51 #Tirupati

–జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ జి.వరప్రసాద్

ప్రజాశక్తి -కోట : ప్రతి పంచాయతీలో గ్రామస్తులకు ఉపాధి కల్పించడానికి ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేపట్టాలని జిల్లా ఏపీడి డాక్టర్ జి.వర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కోట మండలంలోని తిమ్మనాయుడుపాలెం, వెంకన్నపాలెం గ్రామపంచాయతీలో ఎన్ఆర్ఈజిఎస్ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని జిల్లా ఏపీడి జీ. వరప్రసాద్ టీమ్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా పలు పంచాయితీల్లో చేసినా పనులను మరలా అక్కడే చేస్తున్నట్లు ప్రత్యక్షంగా తెలిసిందన్నారు.అలా కాకుండా చేసిన చోట మరలా చేయకుండా మరొక ప్రాంతంలో వేరే పనులను ప్రారంభించాలని సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు పలు సూచనలు, సలహాలను అందజేయడం జరిగింది. ఒకవేళ ఉపాధి పనులపై లోపాలు తలెత్తితే సంబంధించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటానని జిల్లా ఏపీడి జీ.వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కంట్రోల్ ఆఫ్ క్వాలిటీ ఆఫీసర్ (జేక్యూసీఓ)ఎమ్.వి.రమణ,ఎస్ కే.ఖలీల్,తదితర ఎన్ ఆర్ జి ఈ ఎస్ బృందం,టెక్నీషియన్ లు చంద్రశేఖర్,స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ లు ఉన్నారు.

➡️